అలుగు పారుతున్న లక్ష్మీ సముద్రం చెరువు


Sun,October 20, 2019 04:43 AM

పాల్‌పేట: గోపాల్‌పేట సంస్థానాధీశుల కాలంలో ప్రజలకు సాగునీటిని అందించేందుకు మండలంలోని తాడిపర్తి లక్ష్మీ సముద్రం చెరువు నిర్మించారు. వర్షాలు పుష్కలంగా పడితే తప్పా చెరువు నిండేది కాదు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కంపచెట్లు, మురికి తుమ్మలతో ఉన్న చెరువుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులో పూడిక తీసి, చెరువును చదును చేశారు. ఏటా వర్షాలు అనుకున్న స్థాయిలో కురువకున్నా కేఎల్‌ఐ నీటితో నిండి రైతులకు సాగునీరు అందిస్తుంది. ఈ వానాకాలంలో కూడా కేఎల్‌ఐ నీటితో నిండి అలుగు పారుతుండటంతో జలకళ సంతరించుకున్నది. చెరువు నిండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు ఒకసారి నిండితే రెండు పంటలు పండుతాయి. చెరువునీటితో సుమారు 500 ఎకరాలకు పైగా పంటల సాగవుతుంది. చెరువు కింద వరితోపాటు ఎగువ రైతులు మోటార్ల ద్వారా వేరుశనగ పంటలు పండిస్తారు. ప్రతి ఏడాది ప్రభుత్వం ఉచితంగా మత్స్యకారులకు చేపపిల్లలను అందజేస్తుండగా లక్షల సంఖ్యలో చెరువులో చేపపిల్లలను వదిలి చేపల వేటతో గ్రామంలో మత్స్యకారుల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. చెరువునీటితో రైతులతోపాటు మత్స్యకారులకు లబ్ధి చేకూరుతున్నది. అలుగు, 5తూంలు కలిగిన ఈ చెరువు నీటి సామర్థ్యం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. కేఎల్‌ఐ నీటి రాకతో రైతులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో పుష్కలంగా పంటలు పండిస్తున్నారు. చెరువులో నీళ్లు ఉండటంతో భూగర్భ జలాలు పెరిగి గ్రామానికి అవసరమైన తాగునీటి బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. చెరువు ఊరికి ఆదెరువుగా మారింది.

అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తం
సోషల్‌మీడియా పుణ్యంతో జిల్లా వ్యాప్తంగా ఉండే అధికారులు, ప్రజా ప్రతినిధులు కొంతమేర చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి వివాదాలు, సమస్యలు వచ్చినా వాటిని సత్వర పరిష్కారాలు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా ప్రజలకు చేరువవుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు సమకాలిన రాజకీయాలు, తదితర అంశాలపై స్పందిస్తున్నారు. తాము నిత్యం పాల్గొనే కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలపడం, అధికారులైతే తాము చేసే అభివృద్ధి, సమస్యల పరిష్కారాలను, తీసుకున్న చర్యలు పోస్టు చేస్తున్నారు. రాజకీయ నాయకులు తమ అభిమానులు, కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. అధికారులైతే తమ ఉన్నతాధికారులతో, కిందిస్థాయి సిబ్బందితో ఎప్పుడూ చాట్‌లో ఉంటున్నారు. వీరికి వచ్చే పోస్టులకు కూడా స్పందిస్తున్నారు. ప్రజాసమస్యలకు తమ పరిధిలో పరిష్కారం చూపుతున్నారు. ఆపద సమయాల్లో అండగా నిలుస్తున్నారు. తమవంతు సాయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...