దారి దోపిడీ ముఠా అరెస్ట్


Fri,October 18, 2019 11:54 PM

మహబూబ్‌నగర్ క్రైం : తాగుడుకు బానిసై రోడ్డు మార్గం లో వెళ్లే వారిపై దాడి చేసి దారి దోపిడీకి పాల్పడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు నేరస్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈనెల 15న హన్వాడ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన దారి దోపిడీ కేసును దర్యాప్తు నేపథ్యంలో దారి దోపిడీ మూఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్నూల్ జిల్లా సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన కృష్ణ ఆటోను అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తుడన్నారు. ఈ క్రమంలో అతడికి కర్నూల్ చెందిన జానాకి, ఆమె తల్లి రాములమ్మ ఇతనికి పరిచయమయ్యారన్నారు. ఈ సమయంలో ఈ ముగ్గురు కల్లు తాగడానికి అలవాటు పడ్డారన్నారు. దీంతో తాగడానికి డబ్బులు సరిపడలేక పోవడంతో కూలీ పనులు చేసే మహిళలను లక్ష్యంగా చేసు కొని దారి దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో కర్నూల్‌కు చెందిన మల్‌రెడ్డి ఏపీ 21 సీడబ్ల్యు 4725 ఆటోను అద్దెకు తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి మహ బూబ్‌నగర్ జిల్లాకు చేరుకున్నారన్నారు.

ఈ క్రమంలో మహబూబ్ నగర్ పట్టణం నుంచి హన్వాడ వైపు వెళ్తున్న యారోనిపల్లి, యాలినితండా, మునిమోక్షం, మహబూబ్ నగర్ మండలం జైనల్లీపూర్ గ్రామాలకు చెందిన పలువురు మహిళలున ఆటోలో ఎక్కించుకొని అడవుల్లోకి తీసుకెళ్లి వారి మెడలో ఉన్న బంగారం, వెండి నగదు అపహరిం చారన్నారు. దారి దోపిడీ కేసులో ఈ ముగ్గురు నిందితులను శుక్రవారం పట్టుకొని ఈ ముఠా నుంచి 27 గ్రాముల బంగారం, 153 గ్రాముల వెండి, రూ.87,100 నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముగ్గురు నేరస్తులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రూరల్ సీఐ మహేశ్వర్ రావు, హన్వాడ ఎస్సై లెనిన్, కానిస్టేబుల్ ముత్తయ్య, శంకరయ్య, గన్నయ్య, రియాజ్, కృష్ణయ్య, శ్రీనివాస్, రామాంజనేయులు, రాంచందర్‌లను ఎస్పీ అభినందిం చారు. ఈ సమావేశంలో డీఎస్పీ భాస్కర్ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...