పటాలంలో ఆయుధాలపై అవగాహన


Fri,October 18, 2019 11:54 PM

ఇటిక్యాల : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు శుక్రవారం ఎర్రవల్లి చౌరస్తా పదవ పటాలంలో విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పటాలం సిబ్బంది ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, హిన్షాస్, కార్బన్, పిస్టల్, ఎల్‌ఎంజీ వంటి అయుధాలను ప్రదర్శనకు ఉంచి ఆయుధాల తీవ్రత, వాటిని ఎలా ఉపయోగిస్తారో విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం వలన విద్యార్థులకు ఆయుధాలపై పరిజ్ఞానము పెరుగుతుందని, అలాగే పోలీస్ ఉద్యోగాలపై మక్కువ పెరుగుతుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ బలపడుతుందని కమాండెంట్ జమీల్‌భాషా తెలిపారు. కార్యక్రమంలో అడిషినల్ కమాండెంట్ ఆది నారాయణ, అసిస్టెంట్ కమాండెంట్‌లు నారాయణదాసు ధర్మరంగారెడ్డి, సత్యనారాయణ, సంక్షేమ అధికారి నరసింహా, ఆర్‌ఐలు వీరన్న, నాగభూషణం, ఆర్‌ఎస్సైలు శ్రీనివాసులు, సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కోదండాపూర్ స్టేషన్‌లో ఎస్సై కృష్ణయ్య విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...