ఎస్సీ కార్పొరేషన్ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి


Fri,October 18, 2019 11:53 PM

తిమ్మాజిపేట : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభు అందజేస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన్‌నాయక్ ఎస్సీలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఎండీ సూచనల మేరకు శుక్రవారం మండల కేంద్రంలో దళిత వాడలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ స్థితి గతులను, యువకుల విద్యార్హతలను ఆయన తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతి, యువకులకు కార్పొరేషన్ శిక్షణ ఇచ్చి రుణాలు అందజేస్తుందని, సేఫ్ట్ ట్రైనింగ్, పంచకర్మ, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్, డెంటల్ అసిస్టెంట్ తదితర 12 యూనిట్ల గురించి వివరించారు. మూడు నెలల వరకు 12 నెలల వరకు శిక్షణ ఇస్తామని, అనంతరం సబ్సిడీపై రుణాలు అందజేస్తామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...