రైతులు జ్ఞాన్ కిసాన్ యాప్‌ను సద్వినియోగపర్చుకోవాలి


Fri,October 18, 2019 11:53 PM

వెల్దండ: అత్యధికంగా కూరగాయాలను పండించి లాభాలు గడించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జ్ఞాన్ కిసాన్ యాప్ ను సద్వినియోగపర్చుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్‌రావు, పాలెం శాస్త్రవేత్త జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జ్ఞాన్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య పరిధిలో సాగు చేసే వ్యవసాయంపై ఆదునిక పద్దతిలో పండించడం, యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యాప్ ద్వారా రైతులు పండించే పంటలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తే తద్వారా పంటల సాగుపై మెస్సేజ్ ద్వారా , కాల్ ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు యాప్‌పై అవగాహన పెంచుకొని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ నిరంజన్, అధికారులు సంతోశ్‌రెడ్డి, సుదాకర్, రాములు, ఏవో మంజుల తదితరులు ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...