సరస్వతీ ఆలయంలో..జ్ఞానేశ్వరానందగిరిస్వామి ఆరాధనోత్సవాలు


Fri,October 18, 2019 11:53 PM

నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లా కేంద్రం సమీపంలోని కొలువైన సరస్వతీ ఆలయంలో శుక్రవారం జ్ఞానేశ్వరానందగిరిస్వామి ప్రథమ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పారాయణ భజనలు నిర్వహించారు. 12.30 గంటలకు శ్రీశ్రీ పరమాత్మానందగిరి స్వామిచే పూజ్యశ్రీ జ్ఞానేశ్వర నందగిరిస్వామి విగ్రహాన్ని సరస్వతీ ఆలయం ఆవరణలో ఆవిష్కరించారు. గురుపూజా కార్యక్రమం స్వామివారి కుటుంబ సభ్యులచే నిర్వహించారు. దేవాలయ ధర్మకర్తలు, వచ్చిన అతిథులు, శ్రీశ్రీ పరమాతానందగిరి స్వామి గురించి మాట్లాడారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను, భజన బృందాలను దేవాలయ ధర్మకర్తల మండలి సన్మానించారు. ఈ అధ్యక్షుడు లక్ష్మిశేఖర్, కార్యదర్శి ఎలిమె ఈశ్వరయ్య, మిడిదొడ్డి శివశంకర్, నర్సయ్య, మంచన విట్టలయ్య, శారదమ్మ, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles