రక్తదానం చేసి.. ప్రాణదాతలు కావాలి


Fri,October 18, 2019 11:52 PM

నాగర్‌కర్నూల్ క్రైం : రక్తదానం చేసి ప్రాణదాతలు కాలవాలని డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఆయన మాట్లాడుతూ అన్ని దానాలకు మించింది రక్తదానమని, మనం ఇచ్చే రక్తం వల్ల అత్యవసర సమయాల్లో ప్రాణాన్ని కాపాడినవారమవుతామన్నారు. ఈ శిబిరంలో 65 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ భగవంత్‌రెడ్డిలు స్వయంగా రక్తదానం చేయడంతో డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ రమేశ్‌రెడ్డి, కోశాధికారి రాధాకృష్ణ, శ్రీధర్, బ్లడ్ డొనేషన్ కన్వీనర్ రాజ్‌కుమార్, వైఆర్‌సీఅండ్‌జేఆర్‌సీ కన్వీనర్ కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు రమేశ్, ఎధర్, షఫీ, రామస్వామి, నారాయణ, నవీన్, వినోద్, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ కిశోర్, సిబ్బంది మోహిద్,తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...