సేవలను ఇలా వినియోగించుకుంటాం...


Fri,October 18, 2019 02:02 AM

విద్యాంజలి పథకం కింద సేవకు వచ్చే వారికి రవాణా భత్యం, ఇతర ఖర్చులకు విద్యాశాఖ ఎలాంటి నిధులు కేటాయించదని, సేవాభావంతో ముందుకు రావాలని డీఈవో కోరారు. పాఠశాలల్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చే విశ్రాంత ఉద్యోగులకు, విషయ నిపుణులు, స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థల వారు, సహ పాఠ్యాంశాలైన గానం, ఉపన్యాసం, పాత్రధారణ, మాదిరి వస్తువుల తయారీ, సంగీతం, నృత్యం, కంప్యూటర్ విద్య, నైతిక విద్య తదితర అంశాలపై బోధన చేయవచ్చు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆసక్తి గల విశ్రాంత ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్జీవోలకు సంబంధించిన వారు తమ వివరాలను ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ఎంఈవోలకు తెలియజేయాలన్నారు. తాము ఏ గ్రామంలోని ఏపాఠశాలలో పనిచేయాలనుకుంటున్న విషయాలను కార్యాలయంలో అందజేయాలన్నారు. ఏ సబ్జెక్టుపై ఆసక్తి ఉంది, ఏసమయంలో బోధించాలనుకుంటున్నారో తెలియపర్చాలన్నారు. తమకు నచ్చిన సబ్జెక్టుల్లో నచ్చిన పాఠశాలలో బోధన చేయవచ్చు. విషయాంశాలతో పాటు కళలు, క్రాఫ్ట్, సబ్జెక్టులలో కూడా బోధించే వీలుందన్నారు. విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, యువత తీసుకోవాలని డీఈవో కోరారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...