తాసిల్దార్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం


Fri,October 18, 2019 02:02 AM

పెబ్బేరు : పెబ్బేరు పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం రైతు క్షణికావేశంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం కలకలం రేపింది. అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది బాధితుడిపై నీళ్లు చల్లి ప్రమాదం బారి నుంచి కాపాడారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... చెలిమిల్లకు చెందిన మణెమ్మ పేరు మీద సర్వే నెంబర్ 208/1లో 1.26 గుంటల భూమి ఆర్వోర్, కొత్త పాస్ బుక్‌లో ఉందన్నారు. అయితే రికార్డులో తమ పేరున ఉందన్నారు. దానిని సర్వే చేసి హద్దులు ఏర్పర్చాలన్నారు. అందుకోసం కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోక పోవడంతో రైతు మణెమ్మ కుమారుడు ఆంజనేయులుగౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మీడియా ముందు వాపోయాడు. తమకు న్యాయం చేయాలని పలుమార్లు తాసిల్దార్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

నా పేరు మీద ఉన్న పొలంలో సర్వే చేసి హద్దులు చూపాలని బాధితులు తమ గోడును ఎంఆర్‌వో, వీఆర్‌వో, పోలీసు అధికారులతో తమ గోడును వినిపించారు. గతంలో ఇక్కడ పని చేసిన అధికారుల తప్పిదాల వల్లనే ఇరువర్గాల రైతుల మధ్య ఘర్షణలు మొదలైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత అధికారులు వాస్తవా లను గుర్తించి రైతుల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై తాసిల్దార్ సునీతను వివరణ కోరగా గతంలో మోకం మీదకు పోయి పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు పంపించామన్నారు. శనివారం రోజున మోకం పైకి వెళ్లి పరిశీలించి పోలీస్ ప్రొడక్షన్‌తో సర్వే చేయించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...