మత్స్యకారుల అభ్యున్నతికి చర్యలు


Thu,October 17, 2019 02:24 AM

-జిల్లా మత్స్యశాఖ అధికారి మహిపాల్
-సింగవట్నం రిజర్వాయర్‌లో 6లక్షల చేపపిల్లల విడుదల
కొల్లాపూర్,నమస్తేతెలంగాణ: సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చేయూతనివ్వడం జరుగుతుందని నాగర్‌కర్నూల్ జిల్లా మత్స్యశాఖ అధికారి మహిపాల్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. పరిధిలోని సింగవట్నంలో శ్రీ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రెండో విడుతగా బుధవారం 6 వివిధ రకాల చేపపిల్లలను వారు వదిలారు. వారు మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పూర్తి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చేపపిల్లలను నీటి జలాశయాల్లో వదులుతున్నట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ రషీద్, ఆఫీసర్ నెహ్రూ, ఆఫీసర్ అంజయ్య, మత్స్య సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...