వనరుల ఆధారంగా వ్యవసాయం చేయాలి


Thu,October 17, 2019 02:21 AM

బిజినేపల్లి : వనరుల ఆధారంగా వ్యవసాయం చేయాలని, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, సేంద్రియ వ్యవసాయం లాంటివి అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని కేవీకే కో ఆర్డినేటర్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వడ్డెమాన్ గ్రామంలో రావేప్ విద్యార్థుల గ్రామాభివృద్ధిలో వనరుల పాత్రపై అధ్యాయనం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో పంటలను సాగు చేయాలన్నారు. అనంతరం విద్యార్థుల గ్రామ వనరులపై చిత్ర పటాల ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్యంగా కాలగమనం పట్టిక, చపాతి డయాగ్రామ్, పంట కా రకాల ఎంపిక, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు చూయించారు. శాస్త్రవేత్తలు రాజశేఖర్, ఆదిశంకర్, ఏవో నీతి, రావేప్ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...