నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు


Thu,October 17, 2019 02:21 AM

బిజినేపల్లి : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కేసీఆర్ కిట్ నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని జిల్లా ఉప వైద్యాధికారి వెంకటదాసు అన్నారు. బుధవారం మండలంలోని పాలెం గ్రామంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో కేసీఆర్ కిట్టు నమోదు పర్చాలని, రోజు వారిగా కేసీఆర్ కిట్టు డస్ట్ బోర్డును పరిశీలిస్తున్నామన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదులో ఎప్పటి డాటా అప్పుడు నమోదు చేయడం, లబ్ధిదారులకు సకాలంలో లబ్ధి చేకూరుస్తుందని వివరించారు. ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా ఎఎన్‌ఎమ్‌లు, గ్రామాల వారిగా ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని, వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర వ్యాధులు ఉన్న వారిని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట డిప్యూటీ డీఎంహెచ్‌వో మోహనయ్య, ప్రోగ్రామ్ అధికారి మేరారాజ్, శ్రీకాంత్, రేణయ్య, సందీప్, కుమార్, వైద్య సిబ్బంది, పర్యవేక్షణాధికారులు ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...