వరాహాల దాడిలో వృద్ధుడి మృతి


Thu,October 17, 2019 02:20 AM

బిజినేపల్లి : వరాహాల దాడితో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వడ్డెమాన్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్డెమాన్ గ్రామానికి చెందిన 65 యేండ్ల కొండయ్య తన ఇంటి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. రెండు, మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేక పోవడం వల్ల నిద్రిస్తున్న వృద్ధుడిపై గ్రామంలో తిరుగుతున్న వరాహాలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వరాహాలు ఒకేసారి దాడి చేసి వృద్ధుడి తల, చేతులు, పీక్కు తిన్నట్లు తెలిపారు. చుట్టు పక్కల ఇళ్ల వారు వృద్ధుడికి అన్నం పెట్టడానికి వెళ్లి చూస్తే అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు గుర్తించారన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు స్థానిక గ్రామంలో ఉన్న వరాహ కాపరుల ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...