నేటి నుంచి ఎంపికైన పోలీసు అభ్యర్థులకు వైద్య పరీక్షలు


Wed,October 16, 2019 02:30 AM

మహబూబ్‌నగర్ క్రైం: పోలీసుశాఖలో ఇటీవల ఎంపికై అటెస్టేషన్ ఫారాలు తీసుకున్న అభ్యర్థులు బుధవారం నుంచి జిల్లా పోలీసు హెడ్‌క్వాటర్స్‌లో హాజరుకావాలని ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుశాఖలోని వివిధ పోస్టుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకున్నదన్నారు పోలీసు ఉద్యోగానికి ఎంపికయిన వారు వారం రోజులుగా పోలీసు హెడ్‌క్వాటర్స్‌కు వచ్చి అటెస్టేషన్ ఫారాలు అందించగా, ఎంపికైన వారిలో 154 మంది ఆభ్యర్థులు అటెస్టేషన్ ఫారాలు తీసుకోవడానికే హాజరు కాలేదన్నారు. చట్టప్రకారం ఉద్యోగానికి ఎంపిక అయిన తర్వాత, సదురు వ్యక్తి ఉద్యోగంలో చేరటానికి ఇష్టం లేకపోతే, తనకు ఇష్టం లేని విషయాన్ని తెలుపుతూ వ్యక్తిగతంగా వచ్చి రాతపూర్వకంగా అధికారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. అధికారికమైన ఆదేశాంగా అభ్యర్థులు గమనించాలి. ఈ విషయంలో సందేహాలు ఉంటే 9440795701, 9985890808నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఇక ఇప్పటికీ అటెస్టేషన్ ఫారాలు ఇచ్చిన ఆభ్యర్థులకు వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 16 నుంచి ఆభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలలో ఉదయం 7గంటలకు ఖచ్చితంగా పోలీసు హెడ్‌క్వాటర్స్‌లో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. వైద్య పరీక్షలకు వచ్చే ఆభ్యర్థులు నాలుగు పాస్‌పోర్టు కలర్ ఫొటోలు, వైద్యపరీక్షలకు కావాల్సిన అధికారిక ఫీజు తీసుకు రావాలని సూచించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...