ఎస్సీ గురుకుల పాఠశాలను సందర్శించిన గురుకులాల కార్యదర్శి


Wed,October 16, 2019 02:29 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: కల్వకుర్తి పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలను గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. అంతకు ముందు స్థానిక అక్షరవనంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో పా ల్గొన్నారు.

స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దాలి
నాగర్‌కర్నూల్ టౌన్: రాష్ట్రంలోని నగరాలు, ము న్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో సిటీ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పుర పాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరా మారావు తెలిపారు. 30రోజుల పంచాయతీ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలతో గ్రామాలు సుందరంగా తయారయ్యాయన్నారు. అదే స్ఫూర్తితో నగరాలు, మున్సిపాలిటీలలో సిటీ శానిటేషన్ ప్లాన్ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం సచి వాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ పారిశుధ్యంపైన ప్రతి పురపాలిక, పట్టణ పారిశుధ్య ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్, మున్సిపాల్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశా రు. చెత్త సేకరణ నుంచి రిసైక్లింగ్ వరకు అన్ని వివరాల ను ఈ ప్రణాళికలో ఉంచాలన్నారు. ఇప్పటికే పాత మున్సిపాలిటీల్లో స్వచ్ఛ ఆటోలు ఇచ్చామని, ఇంకా అవసరమైతే వాహనాలను, సిబ్బందిని పెంచుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను కల్పించేలా ఆయా ఏజెన్సీలను ఆదేశించాలన్నారు. పంచాయతీ సిబ్బంది ప్రభుత్వం కల్పిస్తున్న భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నగరంలో మహిళలకోసం ప్రత్యేక షీ-టాయిలెట్ల నిర్మాణం చేయాలన్నారు. ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసి, వారం రోజుల్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు(సీడీఎంఎ) సమర్పించాలన్నారు.
నూతన పురపాలక చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర పుర పాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 251ని అనుసరించి సిటీ శానిటేషన్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జేసీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ని నాలుగు మున్సిపాలిటీల్లో గ్రీన్ ప్లాన్ ఏర్పాటు చేసుకో వడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీడీఎంఎ శ్రీదేవి, వాటర్ వర్స్ డైరెక్టర్ దానం కిషోర్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ నుంచి వీసీలో మున్సిపల్ కమిషనర్లు జయంత్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట య్య, అధికారులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి: గ్రామాల్లో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటదాసు అన్నారు. మండలంతో పాటు కల్వకోల్‌లో జ్వరపీడితుల సర్వేను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మలేరియా అధికారులు, ఏఎన్‌ఎంలోపర్యటించి కాలనీలోనీటి నిల్వలేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మలేరియా అధికారి వరప్రసాద్, రాంమోహన్, ఓంకార్, ఏఎన్‌ఎం భాగ్యమ్మ, చెన్నయ్య పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...