ఓటర్ల సవరణ త్వరగా పూర్తి చేయాలి: జేసీ


Tue,October 15, 2019 02:26 AM

నాగర్‌కర్నూల్ టౌన్: ఓటర్ల జాబితా సవరణపై తాసీల్దార్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ససూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తాసిల్దార్లతో ఓటర్ల సవరణ పై వీసీ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో వసరణలు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. తాసీల్దార్లు, బీఎల్‌వోలు, వీఆర్‌వోలతో గ్రామసభలు ఏర్పాటు చేసి పూర్తి విచారణ జరిపిన అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో నమోదు పరచాలన్నారు. ఈకార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌వో మధుసూదన్‌నాయక్, ఆర్డీవో హనుమానాయక్, కలెక్టరేట్ ఏవో జాకీర్‌అలీ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles