మహిళల పక్షపాతి సీఎం కేసీఆర్


Tue,October 15, 2019 02:25 AM

వంగూరు: మహిళల పక్షపాతిగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ వారిని అన్నివిధాలుగా ఆదుకుంటు న్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం వంగూరు మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల మా ట్లాడుతూ ఆడబిడ్డ పుట్టింది మొదలు వివాహం చేసే వరకు సీఎం కేసీఆర్ వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా వారికి అండగా ఉంటున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టనటువంటి సంక్షేమ పథకాలను రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇంటికి పెద్దదిక్కులా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ ఆడబిడ్డల పెండ్లిళ్లు చేస్తున్నారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ, వైస్‌ఎంపీపీ సంధ్యారాణి, తాసిల్దార్ నాగమణి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నరేందర్‌రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గణేశ్‌రావ్, కృష్ణారెడ్డి, రాజేందర్‌రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ హమీద్, సర్పంచ్‌లు లావణ్య, ఆంజనేయులు, నాయకులు రాజరంగారావ్, కర్ణాక ర్‌రెడ్డి, ఎల్లాగౌడ్, హరినాథ్, లక్ష్మయ్య, జంగయ్యతో పాటు లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.

సేవా భావాలను అలవర్చుకోవాలి
అచ్చంపేట రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాలను అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వికాస తరంగిణిల ఆధ్వర్యంలో మండలంలోని ఐనోలులో ఏర్పాటుచేసిన మహిళా ఆరోగ్య వికాస్ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వికాస తరంగిణి రా ష్ట్ర అధ్యక్షురాలు అనితారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళలకు నిర్వహించిన గర్భాశయ, రొమ్ము వ్యాధులకు గాను 187 మంది మహిళలకు వైద్యపరీక్షలు చేశారు. ఆరోగ్యంపై మహిళలు ఎల్లప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శాం లోక్యానాయక్, జెడ్పీటీసీ మంత్య్రానాయక్, సీడీపీ వో దమయంతి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కమల, నాయకులు నర్సింహ్మగౌడ్, శిబిరం ఇన్‌చార్జి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...