బ్రహ్మోత్సవానికి వేళాయే..


Mon,October 14, 2019 02:23 AM

చిన్నచింతకుంట: పాలమూరు ప్రజల రెండవ తిరుపతిగా, ఆరాధ్యదైవంగా కొలువబడుతున్న శ్రీశ్రీశ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 27నుంచి ప్రారంభంకానున్నాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలకు స్వామి వారి ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర,సూదూర రాష్ర్టాలనుంచి లక్షల సంఖ్యలో భక్తులు కదిలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈనెల 27నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు దేవాధాయ, ధర్మధాయ ఆదేశాలమేరకు ఆలయ కార్యనిర్వహాణాధికారి సారా శ్రీనివాసులు, ఆలయ సిబ్బంది జాతర పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈనెల 27 నుంచి జరిగే కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈనెల 15న జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆధ్వర్యంలో జరిగే సమీక్ష సమావేశానికి ఆయా శాఖాల అధికారులు హజరుకావాలని తెలిపారు.

కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
దాతల సహకారంతో పుష్కరిణి పనులు పూర్తిదశకు చేరుకున్నాయి. భక్తులు పవిత్ర స్నానాలు చేయుటకు కోనేరులో కంచె ఏర్పాటుచేస్తున్నారు. భక్తులు పవిత్ర స్నానాలు చేయుటకు 3 ఫీట్ల నీళ్లు ఉంచుతున్నారు. భక్తులకు కోనేటి ఇబ్బందులు తప్పావని ఈవో తెలిపారు.

పాడుబడ్డ ధర్మసత్రం తొలగింపు
ఆనాడు ముక్కెర వంశీయులు నిర్మించిన ధర్మసత్రాలు శిథిలావస్తలో ఉండటంతో బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న ఉద్దేశ్యంతో అట్టి ధర్మసత్రాలను ఆలయ నిర్వహకులు జేసీబీలతో తొలగించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...