వాల్మీకి రామాయణం


Mon,October 14, 2019 02:22 AM

నాగర్‌కర్నూల్ టౌన్: వాల్మీకి రచించిన గ్రంథాలే నేటి యువతకు మార్గదర్శనమై మంచి చెడును తెలుసుకునేందుకు ఉపయోగపడాలని జిల్లా పరిషత్ చైర్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ముఖ్యఅతిథిగా విచ్చేసిన జెడ్పీ చైర్‌పర్సన్ వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ జేసీ శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ ఈతరం యువత సోషల్ మీడియా ఉచ్చులోపడి విద్యాభ్యాసానికి బదులు చెడు వ్యసనాలకు అలవాడుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాల్మీకి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టడంతో యువతకు ఆ మహానీయుడి గురించి తెలుసుకుననే అవకాశం వచ్చిందన్నారు. ద్వారా దేశంలో సామాజిక, సాంస్కృతిక పునాదులు ఏర్పడ్డాయన్నారు. వాల్మీకి రచించిన రామాయణ మహాగ్రంథం ద్వారా మానవ, కుటుంబ సంబంధాలను సమాజానికి తెలియజెప్పాలని ఆమె తెలిపారు. బోయవర్గంలోని వారి పిల్లలకు విద్యాబోధనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి మంచి భవిష్యత్తును కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ప్రకాశ్, సీపీవో మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, డీసీవో శ్రీరాములు, జిల్లా బీ.సీ సహాయ అధికారి భీరం సుబ్బారెడ్డి, మండల బోయ ఐక్యవేదిక అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...