కొనసాగిన కార్మికుల నిరసన


Sun,October 13, 2019 12:06 AM

కొల్లాపూర్‌, కల్వకుర్తి నమస్తే తెలంగాణ/అచ్చంపేటరూరల్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 8వ రోజుకు చేరుకుంది. కొల్లాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరాహారదీక్ష శిబిరం నుంచి కార్మికులు నోళ్లకు నల్లగుడ్డలను కట్టుకొని ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో కార్మికులు మానహారం నిర్వహించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్ల బాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. డిపోలో పనిచేస్తున్న కార్మికులు ర్యాలీగా నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరానికి చేరుకున్నారు. కార్మికుల మౌన ప్రదర్శనలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద భైటాయించి కార్మికులు నోటికి నల్ల గుడ్డ ధరించి మౌన ప్రదర్శనకు సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో 55 ఆర్టీసి, 14 ప్రయివేటు మొత్తం 69 బస్సులు నడిచినట్లు డిపో మేనేజర్‌ మనోహర్‌ స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ యాక్షన్‌ కమిటి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ప్లెక్సీలు పట్టి ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులు నోటికి నల్లగుడ్డ కట్టుకొని గాంధీ పార్కువద్ద చేపట్టిన దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. వీరికి పలు ఉద్యోగ, వామపక్ష, ఉపాధ్యాయ సంఘాలనాయకులు మద్దతు తెలిపారు. ఆయా కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...