సామూహిక వివాహాలపై విస్తృత ప్రచారం


Sun,October 13, 2019 12:06 AM

తిమ్మాజిపేట : ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 1న జరుగనున్న సామూహిక వివాహాలపై శనివారం రెండవ రోజు మండలంలో వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మండలంలోని గుమ్మకొండ, అప్పాజిపల్లి, కోడుపర్తి, బావాజిపల్లి, బాజిపూర్‌, గొరిట, చేగుంట, పుల్లగిరి, వివిధ తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు స్వామిలు వివాహాల గురించి వివరించారు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు ఈ వివాహాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫారాలు స్థానిక ప్రజాప్రతినిధుల వద్ద లేదా మండల కేంద్రంలో లభిస్తాయన్నారు. మండల ప్రధాన కార్యదర్శి రఘుమారెడ్డి, మార్కెట్‌ డైరెక్టర్‌ హుస్సేని, ఆయూబ్‌ఖాన్‌, సర్పంచులు సత్యం, లావణ్య, బాలరాజు, నాయకులు నాగేందర్‌లు పాల్గొన్నారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
తెలకపల్లి : ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చేపట్టబోయే ఉచిత వివాహాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ విజయలక్ష్మి అన్నారు. మండల పరిధిలోని కమ్మరెడ్డిపల్లిలో శనివారం టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఉచిత వివాహాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. డిసెంబర్‌ 1న జరిగే ఈ ఉచిత వివాహాలకు అర్హులైన వారు ఈ నెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ జానకిరాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు భరత్‌, పర్వతాలు,తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...