సంకల్పంతో ముందుకు సాగండి


Sun,September 22, 2019 02:32 AM

-ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
-అన్ని సౌకర్యాలు కల్పనకు సహకారం
-త్వరలో పీజీ కళాశాల ఏర్పాటుకు హామీ
-ఎంపీ పోతుగంటి రాములు
-ప్రతి విద్యార్థి ఉత్తములుగా ఎదగాలి: జెడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి
-జిల్లా కేంద్రంలో అట్టహాసంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం

నాగర్‌కర్నూల్ టౌన్: విద్యార్థులు ఒక సంకల్పంతో ముందుకు సాగుతూ లక్ష్యాన్ని సాధించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన మహిళా డిగ్రీ కళాశాల భవనాన్ని శనివారం ఎమ్మెల్యే మర్రి, పార్లమెంట్ సభ్యులు రాములు, జెడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతిలు ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ మధుసూదన్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థినీలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సంకల్పంతో చదివినప్పుడే తాను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి ఈ గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకున్న వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే రావాలనే ఆలోచనను మానుకొని తమలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి తాను బాగుపడుతూ పది మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న మహిళా డిగ్రీ కళాశాలను 2.25 కోట్ల నిధులతో పూర్తి చేసుకున్నామని, ఇంకా చాలా సౌకర్యాలు కల్పించుకోవాల్సి ఉందన్నారు. త్వరలోనే పీజీ కళాశాలను ఏర్పాటు చేసుకుందామని, నాగర్‌కర్నూల్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని, త్వరలోనే హామీ కూడా నెరవేరుతుందన్నారు.

విద్యార్థులు పాఠ్య పుస్తకాలతోపాటు ప్రపంచాన్ని చదవాలి
విద్యార్థులు తమ తరగతి పుస్తకాలతోపాటు ప్రపంచాన్ని చదవాలని, అప్పుడు మీలో విజ్ఞానం పెరుగుతుందని పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు అన్నారు. ప్రశాంతమైన వాతావరణం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే మర్రి కృషి అభినందనీయమన్నారు. రాజకీయాలు అనేవి సేవా, కర్తవ్యంకోసం పాటుపడడం అని, సేవతో సామాజిక కార్యక్రమాలు చేయవచ్చన్నారు. అనంతరం పీజీ కళాశాల మంజూరు విద్యాశాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యే, ఎం.పీ, జెడ్పీ చైర్‌పర్సన్లను విద్యార్థినీలు ఘనంగా స్వాగతం పలికారు.

ఇష్టంగా చదువుకొని ఉత్తములుగా ఎదగాలి
విద్యార్థినీలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ఇష్టంగా చదువుకొని ఉత్తములుగా ఎదగాని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమని, ఈప్రాంత విద్యార్థినీలకు మంచి అవకాశం అన్నారు. అనంతరం సన్మానం కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీశైలం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యార రమేశ్, తాడూరు ఎంపీపీ సుజాత, ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ రాంచంద్రారెడ్డి, అనసూయ,టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...