మద్దిగట్ల గండికుంటకు గండి


Sat,September 21, 2019 12:09 AM

భూత్పూర్ : మండలంలోని మద్దిగట్ల గ్రామంలోని గండికుంట చెరువుకు గండి పడింది. శుక్రవారం సాయంత్రం కేఎల్‌ఐ కాలువ నుంచి నీళ్లు ఒక్కసారిగా ఎక్కువగా రావడంతో గండికుంట తెగినట్లు ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు, ఎంపీపీకి సమాచారం ఇవ్వండతో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి గ్రామంలో కొంత మందిని జమచేసి జేసీబీని తీసుకొని వెళ్లారు. దాదాపు ఆరు గంటల పాటు శ్రమపడ్డారు. మొత్తానికి నీళ్లు పోకుండా కట్టకట్టారు. ఎంతో కష్టపడి మంగనూరు కాలువ నుంచి నీళ్లను తెచ్చుకుంటే కట్ట తెగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మంగనూరు వద్ద రెండు కాలువలు ఉన్నాయన్నారు. ఒకటి లట్టుపల్లికి, మరోటి మద్దిగట్లకు వెళ్తాయన్నారు. లట్టుపల్లి వైపు వెళ్తే కాలువను ఆ రైతులు పూర్తిగా బంద్ చేశారన్నారు. మద్దిగట్ల కాలువకు నీటి వరదతో పాటు, వర్షం నీరు పెరగడంతో గండికుంట తెగిపోయిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, ఓంకార్‌రెడ్డి, పాతమొల్గర గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...