గోవాలో జడ్చర్లవాసి అనుమానాస్పద మృతి


Sat,September 21, 2019 12:09 AM

జడ్చర్ల రూరల్ : మండల పరిధిలోని బురెడిపల్లి గ్రామానికి చెందిన కోట్ల అమర్‌నాథ్ రెడ్డి(40) గోవాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. బురెడిపల్లి గ్రామానికి చెందిన అమర్‌నాథ్ రెడ్డి సొంత కారు నడుపుకుంటూ జీవిస్తున్నా డని అన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం గ్రామస్తులకు కొందరికి గోవాలోని లాడ్జ్‌లో వ్యక్తి మృతి చెందాడని, అతని వివరాలు సేకరించగా జడ్చర్ల మండలం బురెడిపల్లి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్లు అక్కడి పోలీసుల నుంచి ఫోను వచ్చినట్లు తెలిపారు. దీంతో జడ్చర్ల పోలీసు స్టేషన్‌లో అక్కడి పోలీసులతో మాట్లాడి ంచి మృతి చెందిన వ్యక్తి ఫొటోలు తెప్పించుకొని పరిశీలించడంతో అమర్‌నాథ్ రెడ్డిగా గుర్తించినట్లు తెలిపారు. కాగా అమర్‌నాథ్‌రెడ్డి నడుపుతున్న కారు హైదరాబాద్‌లో ఉందని, అతను గోవాలో చనిపోయాడని అక్కడ తెలుసుకుంటే గుండెపోటు అంటున్నారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. అక్కడ మరణించిన అమర్‌నాథ్ రెడ్డి మరణానికి గల కారణాలు ఇంకా తమకు తెలియవని అనుమానంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా మరణించిన వ్యక్తికి భార్య, తొమ్మది సంవత్సరాల కుమా రుడు ఉన్నట్లు తెలిసింది. శవాన్ని తీసుకొచ్చేందుకు గ్రామస్తులు కొందరు గోవా వెళ్లారని, వారు వచ్చిన తరువాతే వివరాలు తెలుస్తాయని అన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...