బడుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి


Sat,September 21, 2019 12:09 AM

-వీసీలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రమేశ్, అడిషనల్ డైరెక్టర్ కృష్ణారావు

నాగర్‌కర్నూల్ టౌన్: ప్రభుత్వ బడుల బలోపేతానికి డీఈవో లు, ఎంఈవోలు, స్కూల్ కాం ప్లెక్స్ హెచ్‌ఎంలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖాధికారులు జాయింట్ డైరెక్టర్ రమేశ్, అడిషనల్ డైరెక్టర్ కృష్ణారావులు ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం బడుల బలోపేతంపై డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో ఏదో ఒక స్కూ ల్‌ను ఆకస్మికంగా తనిఖీచేసి, ఆ నివేదికలను ఉదయం 11గంటల వరకు ఫోన్ యా ప్‌లో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో టీ హాజరు శాతాన్ని పెంపొందించాలని, విద్యావలంటీర్లకు జీతాల విడుదలపై అడిగి తెలుసుకున్నారు. అన్నిపాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వీసీలో డీఈవో గోవిందరాజులు, సెక్టోరల్ అధికారులు అహ్మద్, మంతటి నారాయణ, ఏపీవో రఘు పాల్గొన్నారు.

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు ఉన్నాయని జాయింట్ కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం డీఈవో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నిల్వ చేసిన బియ్యాన్ని పరిశీలించి, వంటచేసే వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం నాణ్యతగా అందించాలని, బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు నీటిలో శుభ్ర పరిచి వండాలని, వంట వారిని ఆదేశించారు. డీఈవోతోపాటు సెక్టోరల్ అధికారులు మంతటి నారాయణ, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్లుశెట్టి తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...