లావాదేవీల టీవ్యాలెట్


Fri,September 20, 2019 12:55 AM

కల్వకుర్తి రూరల్ : పౌర సరఫరాల శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక డిజిటల్ వ్యాలెట్‌తో రేషన్ దుకాణాల ద్వారా మరింత మెరుగైన సేవలందించేందుకు శ్రీకారం చుట్టిందని జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్‌బాబు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవికన్యక పరమేశ్వరీ దేవాలయంలో జిల్లాలోని ఆయా గ్రామాల రేషన్ డీలర్లకు డిజిటల్ వ్యాలెట్ పైన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్‌వో మోహన్‌బాబుతో పలువురు అధికారులు హాజరై డిజిటల్ వ్యాలెట్‌పైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా టీవ్యాలెట్ గోడపత్రికను ఆవిష్కరించి ప్రొజెక్టర్ ద్వారా సేవలను అందించే విధానాన్ని వివరించారు. డీఎస్‌వో మాట్లాడుతూ పౌరులకు ప్రభుత్వ, ప్రైవేట్ లావాదేవీల చెల్లింపులకు ఈ విధానం చాలా ఉపయోగకరమన్నారు.

టీ వ్యాలెట్ ద్వారా ఇకనుంచి రేషన్ దుకాణాలలో విద్యుత్ బిల్లులు, ఆర్టీఏ కార్యకలపాలు, సెల్ ఫోన్ రీచార్జ్‌లతో పాటు ఎనిమిది రకాల సేవలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 554 రేషన్ దుకాణాలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తునట్లు , ఇక నుండి రేషన్ దుకాణాలు మినీ మీసేవలుగా సేవలందించనున్నట్లు తెలిపారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు నగదు బదిలీ చేసేందుకు, స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపులు చేసేందుకు ఈవ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు రేషన్ దుకాణాలలో టీ వ్యాలెట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీలర్లు గ్రామాలలో ప్రజలకు నగదురహిత సేవలపై అవగాహన కల్పించి ప్రజలు వ్యాలెట్ సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఏఎస్‌వో ఫైసల్ హుసేనీ, తాసిల్దార్ గోపాల్, డీటీలు నర్సింగ్‌రాజ్, రాంమోహన్, రవికుమార్, రాఘవేందర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు దుర్గా ప్రసాద్, రాజ్ స్వరూప్, రేషన్ డీలర్ల సంఘం జిల్లాధ్యక్షుడు సాధిక్ పాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలలోని రేషన్ డీలర్లు హాజరైనారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...