జిల్లాలో 20.5మిల్లీ మీటర్ల వర్షపాతం


Fri,September 20, 2019 12:54 AM

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు 20మండలాల్లో సగటున 20.5మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పంటలకు ప్రాణం వచ్చింది. జిల్లాలోని కోడేరులో అత్యధికంగా 70.5మిల్లీ మీటర్ల వర్షం కురియగా వంగూరులో 37.6మిల్లీ మీటర్లు, కొల్లాపూర్‌లో 37.5మిల్లీ మీటర్ల వర్షం కురియగా లింగాలలో అత్యల్పంగా 0.8మిల్లీ మీటర్లు కాగా చారకొండ మండలంలో మాత్రం వర్షమే కురియలేదు. ఇలా జిల్లాలో సగటున 20.5మిల్లీ మీటర్లుగా నమోదైంది. మొత్తం మీద రెండు రోజుల పాటు కురిసిన వర్షాలు రైతన్నల్లో సంతోషాన్ని కలిగించాయి.

పొంగి పొర్లుతున్న దుందుబీ నది
తాడూరు : కేఎల్‌ఐ నీటితో దుందుబీ వాగు పొంగి పొర్లుతుంది. దీంతో దుందుబీ ఇరువైపులా ఉన్న గ్రామాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పాపగల్ గ్రామం మీదుగా గురువారం ఉదయం దుందుబీ వాగు పొంగి పొర్లుతుండడంతో గ్రామంలోని రైతులంతా అక్కడికి వెళ్లి చూస్తున్నారు. గురువారం ఉదయం తాడూరు మండలంలోని పాపగల్ గ్రామానికి నీరు చేరుకుంది.చెరువు కూడా అలుగు పారడంతో నీటి ఉధృతి పెరిగి దుందుబి వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. దుందుబీ వాగులోకి కేఎల్‌ఐ నీటిని వదిలించి దుందుబీ వాగులో ప్రవహించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఈ ప్రాంత రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...