లక్ష్య బృందం పరిశీలన పూర్తి


Fri,September 20, 2019 12:54 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వ లక్ష్య బృందం రెండు రోజులుగా కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూనిటీలో దవాఖానలో సాగిస్తున్న పరిశీలన గురువారం సాయంత్రం ముగిసింది. కేంద్ర ప్రభుత్వ బృందం డాక్టర్ ప్రీత, డాక్టర్ గిరీశ్ ద్వివేది ఆధ్వర్యంలోని లక్ష్య బృందం రెండు రోజులుగా దవాఖానలో వసతులను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి నివేదిక తయారు చేసింది. దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులతో బృంద సభ్యులు మాట్లాడారు.ప్రతి విషయాన్ని బృంద సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. దవాఖానలో పరిసరాల పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవలకు గ్రేడింగ్ ఇస్తు నివేదిక తయారు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని డాక్టర్ ప్రీత, డాక్టర్ గిరీష్ ద్వివేది పేర్కొన్నారు. చివరగా దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి జ్యోత్స్న,డాక్టర్లు రమేశ్‌చంద్ర,హకీం,బాలకృష్ణ, శివరాం,యశోద బాయి బాబర్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...