కిచెన్ షెడ్ల నిర్మాణాలను చేయాలి


Fri,September 20, 2019 12:54 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : మరుగుదొడ్ల కిచెన్ షెడ్ల నిర్మాణాలు రెండు మాసాల్లో పూర్తి చేయాలని జేసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల కిచెన్ షెడ్డు, మరుగుదొడ్ల నిర్మాణాలపై మండల విద్యాధికారులు ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన మరుగుదొడ్లు, వంట గదుల పనులు చేపడుతున్న పనుల పురోగతిని మండలాల వారిగా సమీక్షించి రెండు మాసాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 46.08 లక్షల రూపాయలతో 134 వంట గదులు మంజూరు కాగా 50 వంట గదులు పురోగతిలో ఉన్నాయని, 9 మాత్రమే పూర్తయ్యాయని, మిగతా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మూత్రశాలలు 21.07 లక్షల రూపాయలతో 89 మరుగుదొడ్లు మంజూరు కాగా మూడు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, 21 పురోగతిలో ఉన్నాయని, నిధులు ఉన్నా పనులు ఎందుకు పూర్తి కావడం లేదని అధికారులను ప్రశ్నించారు. సమావేశంలో డీఈవో గోవిందరాజులు, సెక్టోరల్ అధికారులు, మండల విద్యాధికారులు, డీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...