ప్రభుత్వ కలిసిన యువకులు


Fri,September 20, 2019 12:53 AM

పదర : యురేనియం తవ్వకాలను నల్లమల ప్రాంతంలో నిలిపివేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును హైదారాబాద్‌లో ఆయన నివాసంలో పదర టీఆర్‌ఎస్ యువనాయకులు గురువారం ఘనంగా సన్మానించారు. అనంతరం పదరలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పదరలో తాసిల్దార్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ వారంరోజుల్లో తాసిల్దార్‌ను నియామకానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నాయకులు జగపతి రాజు, రమేశ్, యాదవ్, ఎల్లయ్య, పుణ్యముర్తి సాయి శ్రీకాంత్ చారి , ఎబీవీపీ రాష్ట్ర నాయకులు డ్యాగ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...