ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి


Thu,September 19, 2019 01:35 AM

పెద్దకొత్తపల్లి: విద్యార్థులు ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగీ వ్యాధి నివారణ కోసం ఆయుర్వేద మందులను విద్యార్థులకు డాక్టర్ మౌనిక సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, గోవిందరాజు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేద మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అశోక్‌రెడ్డి, ఉపాధ్యాయుల ప్రభాకర్, మద్దిలేటి, వార్డు సభ్యులు ఎల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...