ఎస్‌ఏ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల


Thu,September 19, 2019 01:34 AM

-డీఈవో గోవిందరాజులు
నాగర్‌కర్నూల్‌టౌన్ : 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ 1 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు డీఈవో గోవిందరాజులు బుధవారం ప్రకటనలో తెలిపారు. నిరంతర సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ-1) పరీక్షల ఏదిలను రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ విడుదల చేశారన్నారు. సమ్మేటివ్ పరీక్షలు అక్టోబర్ 21వ తేది నుంచి 26వ తేది వరకు, 1వ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారని, పరీక్షల కాల నిర్ణయ పట్టిక అనుగుణంగా నాగర్‌కర్నూల్‌లోని అన్ని రకాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుకు సిద్దమై విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...