అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం


Thu,September 19, 2019 01:34 AM

నాగర్‌కర్నూల్‌టౌన్ : సాహసాన్ని ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల, బాలికలను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జిల్లా మహిళా శిశు, వికలాంగులు, వృద్ధ్దుల సంక్షేమ శాఖ 2019 సంవత్సరానికి బాల శక్తి పురస్కార్, బాల కల్యాణ్ పురస్కార్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ప్రజ్వల ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణ అసాధరణ ప్రతిభాపాటవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలలో అవార్డులను అందజేయబడుతుందని తెలిపారు. బాల శక్తి అవార్డుల కోసం బాలలు ఐదేళ్ల పైబడి 18 ఏళ్లలోపు ఉన్న బాల, బాలికలకు (30 సెప్టెంబర్ 2019లోపు) ఉండాలన్నారు. అర్హులైన బాల, బాలికలకు స్వచ్ఛంద సంస్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 30 సెప్టెంబర్ 2019లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చిన రశీదు కాపీని జిల్లా సంక్షేమాధికారి నాగర్‌కర్నూకు చేరవేయాలని సూచించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...