ఆదర్శం వైపు అడుగులు


Wed,September 18, 2019 01:57 AM

-ముమ్మరంగా శ్రమదానం, పారిశుధ్య పనులు
-నిజాలాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న పల్లెలు
-రూ.13 కోట్లతో గ్రామంలో ఎంతో అభివృద్ధి
-స్వశక్తి కరణ్ అవార్డుతో దేశంలోనే గుర్తింపు
మూసాపేట : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న గాంధీజీ కలలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు ముందుకేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాకో.. నియోజకవర్గానికో.. మండలానికో అక్క గ్రామం ఆదర్శంగా ఉంటే సరిపోదని, ప్రతి గ్రామం ఆదర్శంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలను చైతన్యం చేసి పల్లెలను అదర్శ బాటలో నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దేశంలోనే ఆదర్శంగా..
ఒకప్పుడు నిజాలపూర్ గ్రామం ఓ చిన్న పల్లె. ఆ గ్రామం పేరు చెప్పగానే తాపీ కూలీలు గుర్తుకు వచ్చేవాళ్లు. కానీ నేడు దేశంలో ఆదర్శ గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఆ పంచాయతీ దేశ స్థాయిలో స్వశక్తీ కరణ్ అవార్డును సాధించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గ్రామజ్యోతి కమిటీలఏర్పాటుతోనే గ్రామంలో ఎంతో మార్పు వచ్చింది. కమిటీల ఏర్పాటు తర్వాత ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ముందుకొచ్చారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా మాజీ సర్పంచ్ ఇంద్రయ్యసాగర్‌తో కలిసి గ్రామ జ్యోతి కమిటీ ఆధ్వర్యంలో ముందుకు సాగారు. వారి పట్టుదలను చూసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధికి తనవంతు సహకారం అందించారు. గ్రామ మహిళా సంఘాల సభ్యులంతా గ్రామాభివృద్ధిలో తవ వంతు సహకారం అందిస్తామని ఏకమయ్యారు. గ్రామంలోని 32 మహిళా సంఘాలలో 451 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారంతా గ్రామాభివృద్ధిలో మన పాత్ర ఏమిటని ప్రశ్నించుకొని పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామజ్యోతి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ముందుకు వచ్చారు. అప్పటికే రాష్ట్రంలో ఆదర్శ గ్రామాలైన గంగదేవునిపల్లి, హాజిపల్లి, గంట్లవెళ్లి, ఇబ్రహీంపూర్ తదితర గ్రామాలను నిజాలాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సందర్శించింది. ముందుగా పారిశు ధ్యం పాటించాలని నిర్ణయించారు. అందరు ఏకమై గ్రామంలో ఉన్న చెత్తాచెదారం ఊడ్చి పరిశుభ్రంగా తీర్చిదిద్దుకున్నారు. వారికి తోడుగా గ్రామాభివృద్ధి కమిటీ, యువజన సంఘాల సభ్యులు భాగస్వాములయ్యారు. ప్రతి పది రోజులకోసారి గ్రామంలో 150 మంది చొప్పున మహిళా సంఘాల సభ్యులు శ్రమదానం చేయాలని నిర్ణయించారు. వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించాలని తలంచారు. అందుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచనతో జిల్లా అధికారులు సైతం వారికి అన్ని విధాలా సహకరించారు. అప్పటి కలెక్టర్ టీకే శ్రీదేవి, డీపీవో వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ చూయించారు. దీంతో వంద రోజుల్లోనే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పది రోజులకోసారి కాకుండా నిత్యం ఎవరి ఇండ్ల పరిసరాలను వారు శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయించి కొనసాగిస్తున్నారు. దీంతో పలుమార్లు గ్రామాన్ని వివిధ కమిటీల పేర్లతో అధికారులు సందర్శించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అక్కడున్న పరిస్ధితులను అధ్యయనం చేశారు. అందుకే నేడు నిజాలాపూర్ సుజలాపూర్‌గా మారి ఆదర్శంగా నిలుస్తున్నది.

నిజాలాపూర్‌లో..
నిజాలాపూర్ గ్రామంలో 526 ఇండ్లు, 668 కుటుంబాలు ఉన్నా యి. 2,658 మంది జనాభా ఉండగా, 10 వార్డులకు 2100 ఓటర్లు ఉన్నారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 132 మంది, ప్రాథమిక పాఠశాలలో 127 మం ది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 3 అంగన్‌వాడి కేంద్రాలకుగానూ మొదటి కేంద్రంలో 35 మంది, 2వ కేంద్రంలో 35 మంది, 3వ కేంద్రంలో 50 మంది పిల్లలు ఉన్నారు. 6 యువజ సం ఘాలు ఉన్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకంలో 32 గ్రూ పులు, 678 మంది కూలీలుగా పని చేస్తున్నారు. ప్రభుత్వం అం దజేస్తున్న పింఛన్లు మొత్తం 330 మందికి లబ్ధి చేకూరుతున్నది.

రూ.13 కోట్లతో అభివృద్ధి పనులు
నిజాలాపూర్ గ్రామాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దత్తత తీసుకోవడంతో ఆ గ్రామంలో 70 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఐదేండ్లలో జరిగింది. మిషన్ భగీరథ కింద చెరువుల పూడిక తీత, వాడవాడలా సీసీ రోడ్లు, కరెంటు పోల్స్ బిగించడం, త్రీఫేజ్ వైర్లను ఏర్పాటు చేసుకోవగా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ దశలో ఉంది. గురుమందిర్ కామన్‌హాల్ నిర్మించుకున్నారు. వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. బాలవికాసం సౌజన్యంతో ప్రతి ఇంటి సభ్యత్వంతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఆల మహిళా సంఘాలకు ఇచ్చిన రూ.50 వేల ఆర్థిక సహకారంతో ప్రతి ఇంటికి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. 20 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి గృహప్రవేశాలు కూడా చేయించగా.. మరో 77 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా మొత్తం గ్రామంలో ఈ ఐదేళ్లలోనే చేసిన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.13 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది.

పంటలతో కళకళ
చౌడు భూములు అధికంగా ఉండటంతో ఎక్కువగా వరి పంటనే పండిస్తారు. గతంలో వర్షాలు కురిస్తేనే దిగుబడి చేతికి వచ్చేదే. కానీ రెండేళ్లుగా ఎంజీకేఎల్‌ఐ ద్వారా కృష్ణా నీటిని చెరువులకు మళ్లించడంతో నేడు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతు కుటుంబాలు ఆ్థకంగా ఎదుగుతున్నాయి.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...