ఓటరు కార్డు వెరిఫికేషన్‌పై అవగాహన


Wed,September 18, 2019 01:41 AM

మండల విద్యాధికారులు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సీఆర్‌పీ, కంప్యూటర్ ఆపరేటర్లకు మంగళవారం సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఓటరు కార్డు వెరిఫికేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో నాంపల్లి రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడు వారి కుటుంబ సభ్యుల ఓటరు గుర్తింపు కార్డు వెరిఫై చేసి అథెంటికేషన్ చేయాలని కోరారు. ఈ వెరిఫికేషన్‌ను ఎన్‌వీఎస్‌పి.ఇన్ వెబ్‌సైట్, విఠర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా వెరిఫై చేయాలన్నారు. అన్ని మండలాల్లో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సీఆర్‌పీ, కంప్యూటర్ ఆపరేటర్లు ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ విధిగా తమ, కుటుంబ సభ్యుల ఓటరు ఐడీ కార్డులను వెరిఫై చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో విజయభాస్కర్, ఏఎంవో హేమచంద్రుడు, ఎంఈవోలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సీఆర్‌పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...