తరగతి గది నుంచి పొలం మడికి..


Sun,September 15, 2019 02:32 AM

-క్షేత్రస్థాయి పరిశీలనలో వ్యవసాయ విద్యార్థులు
-ఐదు గ్రామాల్లో 28 మంది పర్యటన
-నాలుగు నెలల పాటు కొనసాగనున్న ఫీల్డ్ విజిట్
-పైలట్ గ్రామాల్లో పర్యటిస్తున్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు

బిజినేపల్లి: ఓ వైపు తరగతి గదుల్లో చదువులు..మరో వైపు పంట పొలాల్లో శిక్షణ కార్యక్రమాలు..హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నుంచి 28మంది విద్యార్థులు నాలుగు నెలల పాటు శిక్షణ కోసం గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు కోర్సులో భాగంగా చివరి సంవత్సరం గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి దత్తత గ్రామాలైన గొరిట, పాలెం, నంది వడ్డెమాన్, గుమ్మకొండ, మంతటి గ్రామాల్లో ఉండి వ్యవసాయ పనులపై శిక్షణ పొందుతున్నారు.

వ్యవసాయంలో ఏర్పడే సమస్యలను అక్కడి గ్రామాల్లో ఉండే పరిస్థితులను గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తూలనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి తెలుసుకోవడమే కాక గ్రామ రైతులకు కూడా ఆ గ్రామం యొక్క స్థితి గతులపై అవగాహన పెంపొందిస్తూ భావి తరాలకు ఏ విధంగా సంరక్షించుకోవాలో దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలను రూపొందిస్తారు. పంటల విభాగం, సస్యరక్షణ విభాగం, రూరల్ డెవలప్‌మెంట్, విస్తరణ విభాగాలను అధ్యాయనం చేస్తారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...