పరస్పర రాజీయే.. పరిష్కార మార్గం


Sun,September 15, 2019 02:29 AM

మహబూబ్‌నగర్ లీగల్ : కోర్టుల్లో ఉన్న పరిష్కరించ గలిగే కేసులన్నింటినీ రాజీతోనే పరిష్కరించుకోవచ్చని జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి రఘురాం అన్నారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం ఆయా కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింద న్నారు. పరస్పర సహకారంతోనే ఒకరికొకరు చర్చిం చుకొని రాజీ చేసుకోగలిగితే అంతకు మించి పరిష్కారం ఇంకొకటి ఉండదని చెప్పారు. క్షణికావేశంలో జరిగిన సంఘటనలు కేసులుగా మారి కోర్టుకు వస్తాయని, అటువంటి కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం లోక్ అదాలత్ కల్పించడం జరుగుతుందని చెప్పారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి నేతృత్వంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జిల్లాలో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారు లు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు.

కక్షిదారులకు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించామన్నారు. మోటారు వాహనాలు, క్రిమినల్, సివిల్ కేసుల్లో పరిష్క రించుకోదగిన కేసులను రాజీ చేసుకునే వీలుంటుందన్నారు. కేసులను పరిష్కరించేందుకు వివిధ బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఈ లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 746 కేసులు రాజీ కుదిరాయని తెలిపారు. ప్రీలిటిగేషన్ 161, మోటారు వాహనాలు, చెక్‌బౌన్స్, సివిల్, క్రిమినల్ తదితర కేసులు 585 పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడవ అదనపు కోర్టు న్యాయమూర్తి అజిత్ సింహారావు, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర్‌రావు, రెండవ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి షౌకత్‌జహాన్ సిద్దిఖీ, స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి తేజో కార్తీక్‌లు, కక్షిదారులు, సీనియర్, జూనియర్ న్యాయ వాదులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...