యురేనియం తవ్వకాలతో గిరిజనులకు అన్యాయం


Sun,September 15, 2019 02:28 AM

కల్వకుర్తి రూరల్ : నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలతో గిరిజనులకు తీవ్ర అన్యాయం ఆలిండియా బంజార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హతీరాం నాయక్ అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలో మహిపాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థ్ధానిక బంజార నాయకులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ లంబాడీలు ఐక్యంగా ఉండడంతో పాటుగా రాజకీయంగా ఎదిగి లంబాడీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అమ్రాబాద్ మండలంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్రభుత్వపరంగా ఏ సహాయమైన ప్రజలకి అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో శంకర్, దేవిలాల్ చౌహాన్, సర్దార్‌నాయక్, బాసునాయక్, డాక్టర్ శివరాం, లక్ష్మణ్‌నాయక్, శంకర్‌నాయక్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...