ఘనంగా గణపయ్య నిమజ్జనం


Sun,September 15, 2019 02:27 AM

వెల్దండ: మండల పరిధిలోని కొట్ర గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ భక్తబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనం నిర్వహించారు. పూజలందుకున్న లడ్డుకు వేలం పాట నిర్వహించగా బూత్కూరి వెంకటయ్య అనే కొట్ర భక్తుడు రూ.1,3116 కు దక్కించుకోగా కలషం చెంబును బాల్‌పెంటయ్య అనే భక్తుడు రూ.3100 కు దక్కించుకున్నారు. కోలాటాలు, నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్స కమిటీ సభ్యులు కుమార్, శేఖర్‌గౌడ్, నరే శ్రీకాంత్, మహేశ్, శ్రీనుగౌడ్, శేఖర్, అల్లాజీగౌడ్, వెంకటయ్య, రవి, చెన్నయ్య, రమేశ్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

బల్మూరు: మండలంలోని కొండనాగుల గ్రామంలో గంగాపుత్ర సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గణపయ్యను నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం సాయంత్రం నిమజ్జనంకు తరలించారు. గణపయ్య చేతిలో ఉన్న లడ్డును గంగాపుత్ర యూత్ టీం సభ్యులు బాలరాజు, చంద్రయ్య, లింగం, రాజు, రమేశ్, శివ, నాగర్జున, గంగాధర్, నర్సింహ్మ లు వేలం పాట ద్వారా రూ. లక్ష దక్కించుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. చెన్నకేశవ సభ్యులు రెండోవ లడ్డును రూ. 56వేలకు అంబటి రాజు వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు లింగం, బాలరాజు, బాలస్వామి, తిరుపతయ్య, బుచ్చయ్య, బాలయ్య, రామస్వామి తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...