జడ్చర్లలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత


Sat,September 14, 2019 03:37 AM

జడ్చర్ల రూరల్ : పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో ప్రభుత్వం నిషేంధించిన సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విశ్వసనీయ సమచారం మేరకు బాదేపల్లి గంజ్ ప్రాంతంలోని జీఎస్‌కే కిరాణ దుకాణంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు భారీ ఎత్తున నిల్వలు ఉన్నట్లు తెలియడంతో దాడిచేసి పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుకున్న గుట్కా, సిగరెట్ ప్యాకెట్లను జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి దుకాణ యజమాని కృష్ణ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...