అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు


Fri,September 13, 2019 04:19 AM

-30 రోజుల ప్రణాళికను విజయవంతంగా నిర్వర్తించండి
-పణాళికలు ఏర్పాటు చేసుకోని గ్రామాలపై అసంతృప్తి
-జిల్లా కలెక్టర్ శ్రీధర్
నాగర్‌కర్నూల్ టౌన్: 30 రోజుల ప్రణాళికను విజయవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్‌లో ఎంపీడీవోలు గ్రామ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 453 గ్రామ పంచాయతీలకు గాను 290 గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు ఏర్పాటు చేసుకోలేదని సంబంధిత అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 54 గ్రామాల్లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప్పునుంతల ఎంపీడీవోపై కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటిస్థాయి అధికారి అయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్థాయిలో నిర్వహించే అభివృద్ధి పనులపై వెనకబడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏ గ్రామానికి ఎంత బడ్జెట్ సమకూరుతుందో వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం గ్రామాభివృద్ధికి తప్పనిసరీగా గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి పాటుపడకుంటే వారి పదవిని కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.

30 రోజుల ప్రణాళికలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారమే జరగాలని, ఏఒక్కరు విరుద్ధంగా అమలుపరిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కోఅప్షన్ సభ్యుల ఎన్నిక, స్టాండింగ్ కమిటీ ఎన్నిక నియమ నిబంధనల ప్రకారమే నిర్వర్తించాలని, తప్పనిసరీగా 50శాతం మహిళలకు కల్పించాలని పేర్కొన్నారు. 30 రజుల ప్రణాళికకు మండలానికి ఒక ప్రత్యేక అధికారితోపాటు పది మంది సీసనియర్ జిల్లాస్థాయి అధికారులతో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు గ్రామాలను సందర్శించి నివేదికను రోజువారీగా నేరుగా కలెక్టర్‌కు సమర్పిస్తారని తెలిపారు. ప్రత్యేక అధికారులు గ్రామాల్లో ఉదయం 9 గంటలకే పాల్గొని పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. తిమ్మాజిపేట మండలంలోని మారేపల్లి గ్రామసభ విజయవంతంగా నిర్వర్తించి దాతల నుండి నిధులు సేకరణ ప్రజల భాగస్వామ్యం కల్పించిన ప్రత్యేక అధికారిని కలెక్టర్ అభినందించారు. మారేపల్లి గ్రామాన్ని సందర్శింస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డీపీవో సురేష్‌మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్, పశుసంవర్ధకశాఖాధికారి డాక్టర్ అంజిలప్ప, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, మోహన్‌రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

-ప్రత్యేక అధికారుల నియామకం
నాగర్‌కర్నూల్ టౌన్: గ్రామాల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రణాళికను పర్యవేక్షించేందుకు గాను నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రభు త్వం ఆదిశగా అడుగులు వేస్తోంది. అభివృద్ధి పనులు చేపట్టి పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్న విషయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. నాగర్‌కర్నూల్ మండల కేంద్రానికి శ్రీనివాస్‌రెడ్డి, బిజినేపల్లికి డాక్టర్ వెంకటేశ్వర్లు, సీహెచ్.శ్రీనివాస్, తాడూరుకు సీపీవో మోహన్‌రెడ్డి, తిమ్మాజిపేటకు ఏడీఏ రమేశ్‌బాబు, తెలకపల్లికి డీసీఎస్‌వో మోహన్‌బాబు, పెద్దకొత్తపల్లికి డీడబ్ల్యువో ప్రజ్వల, కొల్లాపూర్‌కు డీఎస్‌సీడీవో అఖిలేశ్‌రెడ్డి, పెంట్లవెల్లికి సీఈవో నాగమణి, కోడేరుకు డీఈవో గోవిందరాజులు, పదరకు ఏడీ శ్రీనివాస్, లింగాల్‌కు జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, బల్మూర్ స్‌డీసీ శ్రీరాములు, ఉప్పునుంతలకు డీబీసీడీవో అనిల్‌ప్రకాష్, అచ్చంపేటకు డీఆర్‌డీఏ ఏపీడీ చంద్రశేఖర్, ఉదయ్‌కుమార్ డిప్యూటీ స్టటస్టికల్ ఆఫీసర్, అమ్రాబాద్‌కు ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటయ్య, కల్వకుర్తికి డీఆర్‌డీఏ ఏపీడీ గోవిందరాజు, వెల్దండకు ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ హనుమంత్, కల్వకుర్తి డిప్యూటీ స్టటస్టికల్ ఆఫీసర్ స్వామి, వంగూరు మండలానికి మార్కెటింగ్ ఏ.డీ బాలమణి, చారకొండకు కల్వకుర్తి ఏడీఏ వెంకటేశ్వర్లు, ఊరకొండ మండలానికి డీహెచ్‌అండ్‌ఎస్‌వో చంద్రశేఖర్‌రావులను నియమించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...