నల్లమలలో యురేనియంపై గరంగరం


Fri,September 13, 2019 04:19 AM

అమ్రాబాద్ రూరల్ : నల్లమల ప్రాంతంలో ప్రజలు యురేనియం భయంతో నిత్యం ఆందోళన చెందుతున్నారు. గురువారం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటిటేడ్ (యూసీఐఎల్) సంస్థకు చెందిన అధికారులు నల్లమలలో పర్యటించారు. యురేనియం వ్యతిరేక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు, మండల పరిధిలోని మన్ననూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ ఏకే సిన్హా ఐఎఫ్‌ఎస్, అమ్రాబాద్ డివిజనల్ అధికారి సుధాకర్‌రావు తన సిబ్బందితో మద్దిమడుగు అటవీ క్షత్రంలో పర్యటనకు వెళ్తుండగా మన్ననూర్‌లోని అటవీశాఖ విశ్రాంతి భవనం వద్ద నాయకులు, యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ నేతలు అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీపీటీ ఏకే సిన్హా వారితో మాట్లాడుతూ యురేనియం కోసం వెళ్లడం లేదని, మా రోజువారి పర్యటనలో భాగంగా వెళ్తున్నామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు అమ్రాబాద్ మండల కేంద్రంకు చేరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాపించడంతో అప్రమత్తమైన నేతలు, ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకొని అడ్డుకొన్నారు. చేసేది లేక అటవీశాఖ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కార్యక్రమంలో యురేనియం వ్యతిరేక సంఘాల నేతలు, ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు.

-నల్లమలలో రిటైడ్ అటవీశాఖ అధికారులు
అమ్రాబాద్ రూరల్: నల్లమలలో నెలకొన్న యురేనియం వ్యతిరేక పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వచ్చిన విశ్రాంత అటవీశాఖ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం నల్లమల ప్రాంతానికి యూసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంతంలో యురేనియంపై సర్వే చేసేందుకు వస్తున్నారన్న సమాచారం అందడంతో నల్లమల ప్రాంత వాసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర నాయకత్వం నుంచి నలుగురు సభ్యుల బృందం గురువారం ఉదయం 11.20 లకుమన్ననూర్ గ్రామంలోని అటవీశాఖ విశ్రాతం భవనానికి చురుకున్నారు. అప్పటికే నల్లమల యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ, యురేనియం వ్యతిరేక పోరాట జేఏసీ నాయకులు, పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గో బ్యాక్ యూసీఏఎల్ అధికారుల్లారా అంటూ నినాదాలు చేశారు. విశ్రాంత అటవీశాఖ అధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నల్లగొండ జిల్లా దేవరకొండలో అక్కడి ప్రజలు సర్వేకు వచ్చిన అధికారులను వెనక్కి పంపిన విషయం మీడియాలో చూశామన్నారు.

నల్లమల ప్రాంత ప్రజలు అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చామని, యురేనియం వెలికితీయుటకు వచ్చే అధికారులకు మాకు ఎలాంటి సంబందం లేదన్నారు. రేడియెషన్ ప్రభావంతో ప్రజలు క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడుతారనే విషయాన్ని నివేధిక పంపుతామని చెప్పారు. కేంద్రం మీ ద్వారా సర్వే చేయుటకు కుట్రలు చేస్తుందని గట్టిగా ప్రశ్నించారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని హెచ్చరించారు. రిటైర్డ్ అటవీశాఖ అధికారులు బాలురెడ్డి, పాండురావు, జైపాల్‌రెడ్డి, మహ్మద్‌లు వెనుదిరిగారు.అడ్డుకున్న వారిలో యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ, జేఏసీ నాయకులు దాసరి నాగయ్య, లక్ష్మీనారాయణ, నాసరయ్య, గోపాల్, బాలకిష్టయ్య, అంబయ్య, అనిల్, కిషోర్, రవి, పాండు, మల్లికార్జున్, పార్టీలకు అతీతంగా నాయకులు సుమారు 50 మంది ఉన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...