యూరియా నిల్వలు ఫుల్


Thu,September 12, 2019 03:59 AM

-జడ్చర్లలో 347 మెట్రిక్ టన్నుల స్టాక్
-ఇప్పటి వరకు 9830 మెట్రిక్ టన్నుల పంపిణీ
-ప్రైవేట్‌లో ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
-రైతులు యూరియాపై ఆందోళన చెందొద్దు
-డీఏవో బైరెడ్డి సింగారెడ్డితో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని రైతాంగం యూరియా కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లా రైతాంగం కోరినంత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లాలో 20 పీఏసీఎస్‌లు, 10 ఆగ్రో కేంద్రాల ద్వారా యూనియా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బైరెండ్డి సింగారెడ్డి తెలిపారు.

నమస్తే తెలంగాణ : జిల్లాలో యూరియా కొరత ఉన్నదా?
బైరెడ్డి సంగారెడ్డి : జిల్లాలో రైతాంగం కోరినంత యూరియా ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నాలుగైదు రోజుల్లో జిల్లాకు 1400 మెట్రిక్ టన్నుల యూరియాను పంపించింది. 5వ తేదీన 200మెట్రిక్ టన్నులు, 7వ తేదీన 700మెట్రిక్ టన్నులు, 8న 500మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా వచ్చింది. జిల్లాలోని ఆయావిండోలకు 1056మెట్రిక్ టన్నుల యూరియా నేరుగా గ్రామాల్లోని సిం గిల్ విండో కేంద్రాలకు పంపిణీ చేపట్టడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం తాత్కాలికంగా ఇబ్బంది కలిగింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో యూరియా నిల్వలున్నాయి.

నమస్తే తెలంగాణ : జిల్లాకు కావాల్సిన యూరియా ఎంత ?ఎంత పంపిణీ చేశారు?
బైరెడ్డి సంగారెడ్డి : జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని బట్టి 40,863మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అయితే జిల్లాలో ఇప్పటి వరకు సింగిల్ విండోలు, పీఏఎస్‌ల ద్వారా 2,587మెట్రిక్ టన్నులు పంపిణీ చేశాం. జిల్లాలోని 147ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా యూరియా పంపిణీ చేస్తున్నాం.నాగర్‌కర్నూల్ డివిజన్‌లో 1148మెట్రిక్ ట న్నులు, కొల్లాపూర్‌లో 478మెట్రిక్ టన్నులు, కల్వకుర్తిలో అత్యల్పంగా 364మెట్రిక్ ట న్నులు, అచ్చంపేటలో అత్యధికంగా 596మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు 6400మెట్రిక్ టన్నులకుపైగా యూరియా అం దించాం. మొత్తం 9380మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించాం. ఖరీఫ్ సీ జన్ ఇంకా ఉన్నందున రైతులకు ఇంకా యూరియా అవసరం ఏర్పడుతుంది. అంచనాల మేరకు యూరియా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం.

నమస్తే తెలంగాణ : ప్రైవేట్ డీలర్ల దగ్గర అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి?
బైరెడ్డి సంగారెడ్డి : యూరియా 40కిలోల బస్తా రూ.266.50, అదే 50కిలోల బస్తాకు రూ.298.50చొప్పున ప్రభుత్వ ధర నిర్ణయించింది. ఇందులో ఒక్క పైసా కూడా ఎక్కువగా విక్రయించరాదు. అధిక ధరలకు విక్రయిస్తే వ్యవసాయ శాఖాధికారులకు సమాచారం అందించాలి. శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తాం. ప్రస్తుతం సరఫరా చేస్తున్న యూరియా సింగిల్ విండోలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలకే అందిస్తున్నాం.

నమస్తే తెలంగాణ : జిల్లాలో ఖరీఫ్‌లో వ్యవసాయ సాగు పరిస్థితి ఎలా ఉంది?
బైరెడ్డి సంగారెడ్డి : ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 2,16,702హెక్టార్లు సాగవుతుందని అంచనా రూపొందించాం. ప్రస్తుతం 1,79,915 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో పత్తి అత్యధికంగా 1,06,728హెక్టార్లుకు, 16,766హెక్టార్లలో సాగవుతుంది. వరి కూడా 11,089హెక్టార్లకు గాను 13,390హెక్టార్లలో సాగవుతుండగా, జొన్న 2873హెక్టార్లకు గాను 3776హెక్టార్లు, మొక్కజొన్న 75134హెక్టార్లకు గాను, 27638హెక్టార్లు మాత్రమే సాగవుతోంది. జిల్లాలో ఈ సీజన్‌లో 83.02శాతం పంటలు సాగతున్నాయి.

నమస్తే తెలంగాణ : రైతులకు సరిపడ యూరియా నిల్వలున్నాయా? బైరెడ్డి సంగారెడ్డి : జిల్లాలో 9380మెట్రిక్ టన్నుల యూరియా అందించాం. ఇంకా కావాల్సిన యూరియాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జిల్లా కోసం జడ్చర్ల బఫర్ పాయింట్ వద్ద 347మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రైతులు యూరియా లేదనే ఆందోళనకు గురికావద్దు. బుధవారం వరకు జిల్లాలోని సింగిల్ విండోల వద్ద 296మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 412మెట్రిక్ టన్నుల చొప్పున 709 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది.

నమస్తే తెలంగాణ : యూరియాలో తేడాలపై రైతుల సందేహాలకు మీ సమాధానం?బైరెడ్డి సంగారెడ్డి : యూరియాలో సన్న, లావు అనే తేడాలతో పంటలకు కలిగే ప్రయోజనంపై రైతులు అనుమానాలకు గురవుతున్నారు. సన్న యూరియానే కావాలని అడుగుతున్నారు. యూరియా ఏదైనా అందులో పంటలకు ప్రధానంగా కావాల్సిన నత్రజని 46శాతం చొప్పున ఉంటుంది. రైతులు యూరియా విషయంలో ఆందోళన అవసరం లేదు.నమస్తే తెలంగాణ : రబీకి యూరియా నిల్వలు చేసుకోవడం సబబేనా?
బైరెడ్డి సంగారెడ్డి : కొందరు రైతులు యూరియా దొరకదనే అనుమానాలతో అవసరానికి మించి తీసుకెళ్తున్నారు. రబీ గురించి ఇప్పుడే యూరియా తీసుకోవడం సరికాదు. దీనివల్ల ప్రస్తుతం ఇతర రైతులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తాత్కాలిక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇదే సమస్య ఉంటుందని అనుమానం పడొద్దు.

నమస్తే తెలంగాణ : రైతులకు యూరియా పంపిణీపై పరిమితులున్నాయా?
బైరెడ్డి సంగారెడ్డి : రైతులకు యూరియా పంపిణీపై ఎలాంటి పరిమితులు లేవు. రైతులు అడిగినంత యూరియా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే కొద్ది రోజులు ఏర్పడిన తాత్కాలిక సమస్యతో రైతులకు ఆయా విండోల ద్వారా ఆధార్ కార్డుకు 4,5సంచుల చొప్పున పంపిణీ చేశారు. ఎంత కావాలన్నా యూరియా అందించేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. సింగిల్ విండో, ఆగ్రో సేవా కేంద్రాల్లో కూడా రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వాలి.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...