కేసుల పరిష్కారంసత్వరమే జరగాలి


Sun,May 26, 2019 03:52 AM

మహబూబ్‌నగర్ లీగల్ : న్యాయస్థానాలను ఆశ్రయించే సామాన్యులకు నమ్మకం కలిగేలా న్యాయం జరగాలని రాష్ట్ర హైకో ర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రా ఘవేంద్ర ఎస్.చౌహాన్ అభిప్రాయపడ్డా రు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం జిల్లా ప్రధాన కోర్టును న్యాయమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ పక్షాన జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 41వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కారం చేసేలా చూడాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 2014 సం వత్సరం వరకున్న కేసులన్నీంటిని ఇప్పటికే పరిష్కరించగలగాలని ఆదేశాలు ఉన్నాయని, వాటి అమలు జరగాలన్నారు. ఈ కేసులను 6 నెలల్లో పరిష్కరించేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు.

దీనిపై హైకోర్టు పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు దృష్టి సారించారని, ఇందుకు అనుగుణంగా న్యాయవాదులు కూడా సహకరించి ఇలాంటి కేసులను వెంటనే పరిష్కరించేందుకు తోడ్పాటునందించాలన్నారు. న్యాయ వ్యవస్థ సామాన్యుడికి నమ్మకం కలిగించేలా పని చేయగలగాలని పేర్కొన్నారు. డాక్టర్‌తో ఒక పేషెంట్‌కు ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుందో అలాగే ఒక న్యా యవాదికి కక్షిదారుడికి కూడా అదే విధమైన అనుబం ధం ఉంటుందని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా లో నూతన కోర్టు భవనానికి ఇప్పుడు కేటాయించిన 10 ఎకరాల స్థలం సరిపోదని, 25 ఎకరాల స్థలం కచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు వివరించడం జరిగిందన్నారు. ఇంత విశాలంగా ఉన్న స్థలంలో చాంబర్లు, లైబ్రరీ, హాల్, ఏటీఎం, స్టాం పుల కొనుగోలు కేంద్రం, కనీస అవసరాల గదులు, పార్కింగ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...