పుణ్యక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు


Sun,May 26, 2019 03:49 AM

ఇటిక్యాల : పవిత్ర బీచుపల్లి క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ఆనంతరం నెలరోజులపాటు దాసంగాలు (కొత్తకుండలో నైవేద్యం) సమర్పించడం ఆనవాయితీ. శనివారం స్వామివారికి దాసంగాలు సమర్పించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం సాయంత్రం నుంచే క్షేత్రానికి వచ్చిన భక్తులు స్వా మివారికి కొత్తకుండలో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్‌లో బారులుతీరారు. ఆలయ అర్చకులు మారుతాచారి, సందీపాచారి, వాల్మీకి పూజారులు స్వామివారికి ఆకుపూజ పంచామృత అభిషేకం, మహామంగళహారతి, తీర్థప్రసాదాల నివేదన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని తాగునీటి ఏర్పాట్లను చేపట్టారు. స్వామివారి దర్శన అనంతరం భక్తులు క్షేత్రంలోని జాతర ప్రాంగణంలో వెలసిన దుకాణాలలో వస్తువులను, తినుబండారాలు, ఇంటి అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి రామన్‌గౌడ్ పర్యవేక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇటిక్యాల పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...