ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచాలి


Sat,May 25, 2019 02:27 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంపొందించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్పీలు వద్ద తమ పరిధిలోని పాఠశాలల్లో 6నుంచి 14సంవత్సరాల వయస్సుగల బడిలో చేరిన విద్యార్థుల సంఖ్యతో పాటు బడిబయట ఉన్న విద్యార్థుల సంఖ్య పేర్ల వివరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అంగన్‌వాడీ నుంచి ఐదు సంవత్సరాలు నిండిన పిల్లల లిస్టు తీసుకుని వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. వలస వెళ్లినవారి కుటుంబ వివరాలను సేకరించి వారి ఇంటిలో బడీడు పిల్లలను వసతి గృహాల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో మొత్తం 386మంది బడిబయటి పిల్లలు ఉన్నారని, వీరిని గ్రామాల్లోని పాఠశాలల్లో గానీ, జిల్లా కేంద్రంలోని వసతి గృహాల్లో కాని చేర్పించి పాఠశాలకు రోజు వెళ్లే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే పాఠ్యపుస్తకాలను పాఠశాలల పున:ప్రారంభానికి ముందే పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఉచిత పాఠ్యపుస్తకాలు చేరే విధంగా చూడాలన్నారు. ఏకరూప దుస్తుల క్లాత్‌ను ఎస్‌ఎంసీ తీర్మానం చేసి దర్జీలకు ఇవ్వాలని, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాం అందేలా చూడాలని, సీఆర్పీలు అందరూ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారి పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...