పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


Sat,May 25, 2019 02:25 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లాలో ఈనెల 27న నిర్వహించనున్న పరిషత్ ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ ఎన్నికల కార్య నిర్వాహణాధికారి, డిప్యూటీ సీఈవో మొగులప్ప అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం జిల్లాలోని నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రక్రియ ప్రాథమిక స్థాయి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మూడు దశల్లో ఉంటుందన్నారు. ఒక్కో బ్యాలెట్ పత్రం పరిశీలనకు సగటున ఐదు సెకన్ల సమయం పడుతుందన్నారు. లెక్క కట్టిన ఎన్నికల అధికారులు అందుకు అనుగుణంగా 2,224మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. జిల్లాలో మే 6,10,14 తేదీల్లో మూడు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఈ బ్యాలెట్ పత్రాలను నాలుగు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూంలో భద్ర పర్చినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్, పాలెం, కల్వకుర్తి, అచ్చంపేటలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఈనెల 27న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 46 హాళ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మూడు దశల ఎన్నికల్లో మొత్తం 4,24,456మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కలిసి 8,48,912 ఓట్లను సిబ్బంది లెక్క పెట్టాల్సి ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సూపర్‌వైజర్లు, సహాయకులు కలిపి మొత్తం 1624మంది విధుల్లో పాల్గొంటారన్నారు. వీరందరికీ ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో 209 ఎంపీటీసీ స్థానాలకు, ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుళ్లు, 46 కౌంటింగ్ రూమ్‌ల్లో మొత్తం 421 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్థంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలతో అదనంగా 600మంది సిబ్బందిని పరిషత్ ఎన్నికల విధుల కోసం నియమించినట్లు తెలిపారు. పరిషత్ ఎన్నికల బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ మూడు విడతల్లో నిర్వహిస్తారని, మొదటగా బ్యాలెట్ బాక్సుల లెక్కింపు, బ్యాలెట్ బాక్సుల్లో పింక్ రంగుల్లో ఉన్న ఎంపీటీసీ ఓట్లను వేరు చేసి 25ఓట్లతో ఒక బెండలను తయారు చేస్తారన్నారు. తెలుపు రంగులో ఉన్న జెడ్పీటీసీ ఓట్లను ఎంపీటీసీ ఓట్ల ప్రక్రియ పూర్తై ఫలితాల అనంతరం జెడ్పీటీసీ ఓట్లు లెక్కిస్తారన్నారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...