ఈవీఎంలకు పటిష్ట భద్రత


Sat,May 25, 2019 02:25 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. గురువా రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి కలెక్టరేట్‌లోని గోదాంకు ఈవీఎంలను తరలించారు. ఈవీఎంలను గోదాంలోని గదుల్లో భద్రపర్చి కలెక్టర్ రొనాల్డ్‌రోస్, నా రాయణపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరిల సమక్షంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్, నారాయపేట జిల్లాల్లోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని ఈవీఎంల గోదాంలో భద్రపర్చామని తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు రాజేంద్రనగర్‌కు, కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను వికారాబాద్ జిల్లాకు తరలించామని పేర్కొన్నా రు. ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేం ద్రాల నుంచి గోదాంలకు తరలించామని తెలిపారు. ఫలితాల అనంతరం కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు ఉంచడం జరుగుతుందని తె లిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...