ఇద్దరి మధ్య గొడవలో ఒకరు మృతి


Sat,May 25, 2019 02:24 AM

కేటీదొడ్డి : ఇద్దరు వ్యక్తులు పడిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చింతలకుంట గ్రా మంలో జరిగింది. ఎస్సై బాలవెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంట గ్రామానికి చెందిన కుర్వ జంబయ్య అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం ప్రతి రోజు కూలీ పనికి వెళ్లేవాడు. ఆయనతో పాటు అదే గ్రామానికి చెందిన రఘు పనికి వెళ్లేవాడు. శుక్రవారం పనికి వెళ్లేందుకు రఘు జంబయ్యను ఇంటికొచ్చి పిలిచాడు. ఈ రోజు నేను పనికి రాను అలసిపోయాను అని కుర్వ జంబయ చెప్పా డు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. లేదు నువ్వు పనికి రావాలి అంటే రావాలి అని రఘు అతన్ని బలవంతం చేశాడు. కొంత సమయం తర్వాత ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం కల్లు దుకాణం దగ్గర మళ్లీ ఇరువురు గొడవ పడడంతో జంబయ్య మృతి చెందాడు. ఈ విషయం ఆయన భార్యకు చూసిన వారు చెప్పారు. ఆమె వచ్చి చూసేలోపే జంబయ్య మృతిచెంది ఉన్నాడు. రఘు జంబయ్యను గట్టిగా కొట్టడంతోనే మృతి చెందినట్లు ఎస్సై బాలవెంకటరమణ తెలిపారు. జంబయ్య కు భార్య శంకరమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల జిల్లా దవాఖానకు తరలించారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...