పటిష్ట బందోబస్తు..


Thu,May 23, 2019 01:47 AM

-లోక్‌సభ కౌంటింగ్ సజావుగా సాగాలి
-జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
-విధుల్లో 200 మంది పోలీసులు
- బాంబ్‌స్కాడ్, బాంబు డిస్పోజల్ స్కాడ్‌తో తనిఖీలు
-ఎస్పీ సాయిశేఖర్

నాగర్‌కర్నూల్ రూరల్ : లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం గట్టి బొందోబస్తు ఏర్పాటు చేసినట్ల్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సాయిశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రాల వద్ద మూడంచెల గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. దయం 5 గంటల నుంచే పోలీసు సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలవద్ద విధుల్లో ఉంటారన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద సీఆర్పీఫ్ బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నెల్లికొండ, మార్కెట్‌యార్డులో తాను (నాగర్‌కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్), మాడ్రన్ బీఈడీ కళాశాలవద్ద ఎస్పీ అపూర్వారావులు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలను డాగ్ స్కాడ్, బాంబు డిస్పోజల్ స్కాడ్లతో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అబ్యర్థులు, ఏజెంట్లు, కౌటింగ్ విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది, నిషేదిత వస్తువులైన అగ్గిపెట్టెలు, లైటర్లు, పేలుడు కారణమయ్యే వస్తువులు కూడా లెక్కింపు కేంద్రానికి తీసుకురాకూడదన్నారు. తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమేలెక్కింపు కేంద్రంలోని అనుమతి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా 144 సెఓన్ అమలులో ఉంటుందన్నారు. దాదాపుగా 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. గతంలో .జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నిబందనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 6 నెలల నుంచి నిర్వహించిన ఎలక్షన్‌లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలోన్ బందోబస్తులో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...